ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమిత్‌షా జీ.. మా రాష్ట్రానికి ఏమిచ్చారో చెబుతారా?: ఎమ్మెల్సీ - Mlc kavitha twitter

MLC Kavitha Tweet on Amit Shah: కేంద్రమంత్రి అమిత్​షాపై ట్విటర్​లో ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు ఏమిచ్చారో చెబుతారా అంటూ నిలదీశారు.

MLC Kavitha Tweet on Amit Shah
ఎమ్మెల్సీ కవిత

By

Published : May 14, 2022, 2:15 PM IST

MLC Kavitha Tweet on Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ తెలంగాణకు రానున్న నేపథ్యంలో తెరాస ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌ వేదికగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ''రూ.3వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ. 2,247కోట్ల సంగతేంటి? ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏంటి? భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏం చెబుతారు? అత్యంత ఖరీదైన ఇంధనం, ఎల్‌పీజీని విక్రయించడంలో భారత్‌ను అగ్రగామి దేశంగా మార్చడంపై మీ సమాధానం ఏంటి?'' అంటూ ట్వీట్ చేశారు.

''అమిత్‌షా జీ.. ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎమ్‌, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐడీ, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ. 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పండి?''

- ఎమ్మెల్సీ కవిత ట్వీట్​

'' అమిత్‌షా జీ.. కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్ర ప్రభుత్వం కపటత్వం కాదా?’’ అని కవిత అమిత్‌షాను ట్విటర్​లో నిలదీశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details