ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: బతుకమ్మ నృత్యాలు చేసిన ఎమ్మెల్సీ కవిత - telangana varthalu

తెలంగాణ జగిత్యాలలోని దొంగలమర్రి చౌరస్తాలో స్థానికులతో కలిసి నిజామాబాద్​ ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. బతుకమ్మ నృత్యాలు చేసి అక్కడి మహిళలను కాసేపు అలరించారు.

బతుకమ్మ నృత్యాలు చేసిన ఎమ్మెల్సీ కవిత
బతుకమ్మ నృత్యాలు చేసిన ఎమ్మెల్సీ కవిత

By

Published : Feb 25, 2021, 11:01 PM IST

తెలంగాణ: బతుకమ్మ నృత్యాలు చేసిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాలలో పర్యటించారు. ఈ క్రమంలో దొంగలమర్రి చౌరస్తాలో స్థానికులతో కలిసి బతుకమ్మ ఆడారు. మంగ్లీ పాడిన రేలారే రేలా పాటకు బతుకమ్మ నృత్యాలు చేసిన ఎమ్మెల్సీ కవిత అక్కడి మహిళలను కాసేపు అలరించారు. కరోనా కారణంగా ఈసారి బతుకమ్మ ఆటలో కవిత పాల్గొనలేకపోయారు.

దీనితో దొంగలమర్రి వద్ద మహిళలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవితకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నిర్ణీత గడువులోగా భూ రీసర్వే పూర్తి చేయాలి: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​

ABOUT THE AUTHOR

...view details