తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్వోగులను తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ గ్రూప్-1 నోటిఫికేషన్ వేయకపోవడం చాలా బాధకరమని తెలిపారు. ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మధ్యంతర భృతి ఇచ్చారని... ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఏపీలో ఉందని తెలిపారు. వయసులో చిన్నవాడైన జగన్‌ను చూసి నేర్చుకోమంటూ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఉద్యోగుల సంఘం నాయకుడు పేరు మీదే శ్రీనివాస్ గౌడ్‌కు మంత్రి పదవి వచ్చిందని... ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల పక్షాన నిలబడకపోతే శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవెందుకంటూ ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని.. కేసీఆర్ ఇప్పటికైనా పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్.. జగన్‌ను చూసి నేర్చుకో: జీవన్ రెడ్డి
ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మధ్యంతర భృతి ఇచ్చారని... తెలంగాణలో మాత్రం 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో చిన్నవాడైన జగన్‌ను చూసి నేర్చుకోమంటూ కేసీఆర్‌కు హితవు పలికారు.
సీఎం కేసీఆర్.. జగన్‌ను చూసి నేర్చుకో: జీవన్ రెడ్డి