ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JEEVAN REDDY DANCE: సరదాగా స్టెప్పులేసిన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి - అమరావతి వార్తలు

రాజకీయ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సరదాగా స్టెప్పులేశారు. జగిత్యాల జిల్లా రాయికల్​లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా.. మొహర్రం వేడుకల్లో భాగంగా పులివేషాలు ధరించి యువకులు నృత్యాలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జీవన్​రెడ్డికి ఈ దృశ్యాలు దర్శనమివ్వడంతో కాసేపు ఆగారు. పులి వేషధారణలో ఉన్న యువకులతో కలిసి స్టెప్పులేశారు. వారిని హుషారెత్తించారు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తూ.. ఫోన్​లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

JEEVAN REDDY DANC
JEEVAN REDDY DANC

By

Published : Aug 15, 2021, 6:27 PM IST

.

సరదాగా స్టెప్పులేసిన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details