ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

mlc elections: త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు?

రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వైకాపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో మూడు ఎమ్మెల్యే కోటాలో, మిగిలిన 11 స్థానిక సంస్థల కోటాలో ఉంటాయి. కొవిడ్‌ కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదావేసింది.

mlc elections
mlc elections

By

Published : Oct 18, 2021, 5:19 AM IST

శాసనమండలిలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు రానున్నాయని అధికార వైకాపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో మూడు ఎమ్మెల్యే కోటాలో, మిగిలిన 11 స్థానిక సంస్థల కోటాలో ఉంటాయి. కొవిడ్‌ కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదావేసింది. ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోర్టు పరిధిలో ఉన్నందున స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇప్పుడు మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

పూర్తి మెజారిటీ?

ఎన్నికలు జరిగితే ఈ 14 స్థానాలనూ వైకాపా దక్కించుకోవచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మండలిలో వైకాపా సభ్యులు 18 మంది. ఇప్పుడు 14 వస్తే మొత్తం సంఖ్యాబలం 32కు చేరుతుందని, దీంతో మండలిలో పూర్తి మెజారిటీ వస్తుందనేది ఆ పార్టీ వ్యూహంగా చెబుతున్నారు.అప్పుడు శాసనమండలి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందంటున్నారు. మండలి మొత్తం సభ్యుల సంఖ్య 58.

అభ్యర్థులెవరు?

14 స్థానాలకూ వైకాపా అభ్యర్థులు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. ఇటీవల పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం సమయంలోనే ఈ స్థానాలకు అభ్యర్థులనూ సీఎం జగన్‌ ఖరారు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారికంగా పేర్లు బయటకు రాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎమ్మెల్యే కోటాలో గత మేలో పదవీకాలం పూర్తిచేసుకున్న బద్వేలు వైకాపా బాధ్యుడు డీసీ గోవిందరెడ్డిని మళ్లీ కొనసాగించే అవకాశముంది. మిగిలిన రెండు స్థానాలనూ ఎస్సీ, మహిళకు ఇస్తారన్న ప్రచారం ఉంది.

స్థానిక సంస్థల విభాగంలో

కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలలో రెండేసి, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, ప్రకాశంలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. వీటికి సంబంధించిన వైకాపా అభ్యర్థులుగా దాదాపు ఖరారైన, లేదా పరిశీలనలో ఉన్న పేర్లలో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. వీరిలో కొందరికి అవకాశం రావచ్చు.

  • గుంటూరు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్‌
  • విశాఖపట్నం: వరుదు కళ్యాణి, వంశీకృష్ణ
  • చిత్తూరు: కె.భరత్‌, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు/హరిప్రసాద్‌
  • ప్రకాశం: తూమాటి మాధవరావు లేదా బీసీ అభ్యర్థి
  • విజయనగరం: ఇందుకూరి రఘురాజు లేదా మరో అభ్యర్థి
  • కృష్ణా: రెండు స్థానాల్లో ఒకటి బీసీ, మరోటి ఓసీ అభ్యర్థికిచ్చే అవకాశం ఉందంటున్నారు. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీసీ అభ్యర్థి విషయంలో స్పష్టత రాలేదు.
  • అనంతపురం: వై.విశ్వేశ్వరరెడ్డి, లేదా మహిళా అభ్యర్థి
  • తూర్పుగోదావరి: అనంత ఉదయభాస్కర్‌, ఆకుల వీర్రాజు, రామసుబ్రహ్మణ్యం, తోట వాణి

ఇదీ చదవండి

cm jagan: గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details