వంద రోజలు పాలన.. వంద తప్పటడుగులు.. వంద తడబాట్లు! - ycp
ముఖ్యమంత్రి జగన్ నూరు రోజుల పరిపాలన వంద తప్పటడుగులు వంద తడబాట్లుగా వుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు.
కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఉపాధిని దూరం చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తమ అధినేత చంద్రబాబు నాయుడిపై కక్షసాధింపులో భాగంగా మధ్యతరగతి ప్రజలకు జగన్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల నుంచి ఉపాధి కోల్పోయిన కార్మికులను ఏ విధంగా ఆదుకొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక టెండర్లను వైకాపా కార్యకర్తలు, నాయకులకు అప్పగించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రచార ఆర్భాటం తప్ప సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం విధి విధానాలను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.