ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇళ్ల పట్టాల పంపిణీని ఎందుకు స్వాగతించడం లేదు?' - ఇళ్ల పట్టాల పంపిణీపై విజయవాడలో ఎమ్మెల్సీ డొక్కా స్పందన

ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు, కనీసం వామపక్షాలు ఎందుకు స్వాగతించడం లేదని.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విజయవాడలో ప్రశ్నించారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 20 కోట్ల మందికి ఉపాధి లభించి.. జీడీపీ 3 శాతం పెరుగుతుందని స్పష్టం చేశారు.

mlc dokka manikya vara prasad
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

By

Published : Dec 26, 2020, 8:48 PM IST

పేదల నోట్లో మట్టి కొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరించకూడదని వైకాపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు శాపనార్ధాలు పెడుతున్నాయని విజయవాడలో ఆగ్రహించారు. సీఎం జగన్ ధృఢ నిశ్చయం వల్లే.. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు వస్తున్నాయని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, కనీసం వామపక్షాలు ఎందుకు స్వాగతించలేకపోతున్నాయని ప్రశ్నించారు.

రాష్ట్రంలో భారీ ఎత్తున గృహ నిర్మాణాలు జరిగితే జీడీపీ 3 శాతం పెరుగుతుందని వరప్రసాద్ అన్నారు. తద్వారా 20 కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే వద్దని చెబుతూ.. హైకోర్టులో తెదేపా కేసులేసిందని ఆరోపించారు. పేదలపై ప్రేమ ఉంటే తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరికీ సెంటు స్థలం ఇవ్వని వ్యక్తులు.. పట్టాల పంపిణీని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details