ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా ఖండించిందని తెదేపా ఎమ్మెల్సీ చెంగల్రాయుడు గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కును కాదనే అధికారం ప్రభుత్వానికి లేదనే విషయాన్ని కూడా కోర్టు చెప్పిందని స్పష్టం చేశారు.
ఉద్యోగులతో పని చేయించుకుంటున్నప్పుడు... వారికి సక్రమంగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తే మంచిదని ఆయన హితవు పలికారు.