కరోనా బాధితులకు ప్రభుత్వం అందించే 2 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కొనసాగించాలని కోరుతూ సీఎం జగన్ కు.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలేఖ రాశారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులను వేధించడంపై ఉన్న శ్రద్ధ.. కరోనా బాధితులపై లేదని విమర్శించారు. అన్న క్యాంటీన్లు తెరిచి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు. మండల స్థాయిలోనూ కరోనా వైద్య పరీక్షలు, వైద్యం ఉచితంగా చేయాలని కోరారు. ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లేఖ - amaravthi news
ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లేఖ రాశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అందించే 2 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని కొనసాగించాలని ఆ లేఖలో కోరారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న లేఖ