ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. ఒకపక్క కరోనా ప్రబలుతుంటే... అందించాల్సిన వైద్యసేవలపై దృష్టి సారించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సీఎంకు తగదన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ని ఆయన ఖండించారు.
'ప్రశ్నించే గొంతులను అణచివేయడమే జగన్ లక్ష్యం' - MLC Buddha comments on CM Jagan
దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కరోనా టీకాలు అందించడంపై దృష్టి సారిస్తుంటే.. ఏపీలో మాత్రం సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపైనే దృష్టి పెడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు ఆరోపించారు.
Buddha Nagajagadishwara Rao