VANAMA VENKATESHWARA RAO: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 40 రోజులుగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న తనకు.. పాల్వంచ ఘటన మనోవేదనకు గురిచేసిందన్నారు. ఇందులో తన కుమారుడు పాత్ర ఉందని వస్తున్న వార్తలతో మరింత క్షోభకు గురవుతున్నానని తెలిపారు.
పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. తన కుమారుడు రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాఘవ నిర్దోశిత్వాన్ని నిరూపించుకునే వరకు నియోజకవర్గానికి దూరంగా ఉంచుతానని చెప్పారు.