ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిలో జరుగుతున్నది ఫొటో ఉద్యమం: ఎమ్మెల్యే శ్రీదేవి - ycp office at thulluru

mla-undavalli-sridevi-in-thulluru
ఉండవల్లి శ్రీదేవి

By

Published : Aug 28, 2020, 1:01 PM IST

Updated : Aug 28, 2020, 1:53 PM IST

12:50 August 28

తుళ్లూరులో వైకాపా కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవి

రైతు కూలీల ముసుగులో తెదేపా నాయకులు అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని గుంటూరు జిల్లా తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. తుళ్లూరులో వైకాపా కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అమరావతి రైతులకు కౌలు డబ్బులు వేసిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమాన్ని ఫొటో ఉద్యమంగా శ్రీదేవి అభివర్ణించారు. 

రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. ఈ ఏడాది కరోనా వల్ల రెండు వారాలు ఆలస్యంగా కౌలు డబ్బులు చెల్లించామన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. ఇదే సమయంలో అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శాసనసభ్యురాలు తుళ్లూరు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దళిత రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు.

ఇవీ చదవండి.. 

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ప్రతిపాదించింది తెదేపా ప్రభుత్వమే: సోమిరెడ్డి

Last Updated : Aug 28, 2020, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details