mla seethakka: తెలంగాణ రాష్ట్రం ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా సీతక్క ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్ అయిపోయింది. దీంతో పడవ వాగు మధ్యలో ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. అనంతరం వాగు ఉద్ధృతికి ఒడ్డుకు కొట్టుకువచ్చింది.
ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం - MLA Seethakka accident news
Mla seethakka: తెలంగాణ ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్ అయిపోవడంతో వాగు మధ్యలో నిలిచిపోయింది. సీతక్క సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సీతక్కకు తప్పిన ప్రమాదం
అప్రమత్తమైన అధికారులు సీతక్కను పడవలో నుంచి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సీతక్కతో పాటు పడవలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపెల్లి వాగులో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవీ చూడండి..