ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vote For Note Case: ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టుకు తెలంగాణ ఎమ్మెల్యే

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీంకోర్డు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Supreme Court
సుప్రీంకోర్టు

By

Published : Aug 16, 2021, 5:05 PM IST

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణలోని సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీంకోర్డు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విచారణ నిమిత్తం పలుమార్లు అనిశా ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహా విచారణకు హాజరయ్యారు. కేసులో సాక్షిగా ఉన్న అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదా రాజారాం వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది.

సదా రాజారాం ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించడంతో .. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ ప్రసంగాల రికార్డులను అనిశాకు సమర్పించారు. పంచనామా సాక్షిగా ఉన్న ప్రధానోపాధ్యాయుడు రాజ్‌కుమార్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ పూర్తయింది. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 6కి వాయిదా వేసింది. సెప్టంబరు 6 నుంచి మిగతా సాక్షులందరి వాంగ్మూలాలు నమోదు చేసేలా న్యాయస్థానం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సండ్ర సుప్రీంకు వెళ్లగా.. సర్వోన్నత న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

గుంటూరు జీజీహెచ్​ దగ్గర ఉద్రిక్తత..నిందితుడిని కఠినంగా శిక్షించాలని నేతల డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details