అంతర్వేది ఘటన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కుట్ర అని వైకాపా శాసనసభ్యురాలు ఆర్కే రోజా ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిందని మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో చెప్పారు. ముఖ్యమంత్రికి ఒక మతాన్ని ఆపాదించేందుకు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని ధ్వజమెత్తారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ఆర్ ఆసరాతో రాష్ట్రంలోని మహిళలు లక్షాధికారులు కాబోతున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు.
అంతర్వేది ఘటన చంద్రబాబు కుట్రే: రోజా
సీఎం జగన్కు ఒక మతాన్ని ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణలో అన్నీ బయటపడతాయని రోజా స్పష్టం చేశారు. అంతర్వేది ఘటనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.
రోజా
Last Updated : Sep 11, 2020, 7:43 PM IST