వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై జరిగిన రాళ్లదాడిపై ఆ పార్టీ ఘాటుగా స్పందించింది. దాడిని తీవ్రంగా ఖండించిన ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా రైతుల ముసుగులో తెదేపా వాళ్లే పిన్నెల్లిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే ఏ రైతైనా దాడికి పాల్పడతారా..? అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
'రైతుల ముసుగులో తెదేపా వాళ్లే దాడి చేశారు..!' - వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి వార్తలు
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిని వైకాపా నేతలు తీవ్రంగా ఖండించారు. రైతుల ముసుగులో తెదేపాకు చెందిన వాళ్లే దాడి చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు.
MLA roja fire on tdp over attack on mla penelli