Raja Singh On Sanjay: ఈటలను ఆడుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని భాజపా ఆ రాష్ట్ర శాసనసభాపక్ష నేత రాజాసింగ్ అన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ వ్యక్తులు కాదని శక్తులని రాజాసింగ్ పేర్కొన్నారు. వారిద్దరితో పెట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మసైపోతారని వ్యాఖ్యానించారు. భాజపా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్న రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Raja Singh On Sanjay: తెలంగాణకు బుల్డోజర్లు...తెచ్చేందుకు సంజయ్ దిల్లీ వెళ్లారు - bjp deeksha in hyderabad
Raja Singh On Sanjay: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుల్డోజర్ల కోసం ఆర్డర్ చేశారని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లను ఎక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అవినీతి పరులను బుల్డోజర్తో తొక్కించారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ దిల్లీ వెళ్లారని.. తెలంగాణకు బుల్డోజర్లు రాబోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ప్రతినియోజకవర్గంలో బుల్డోజర్లను ఆర్డర్ చేశామని.. అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి వాటిని పంపిస్తామన్నారు. భాజపా నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులకు నేతలు సహా కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. తెలంగాణలో రాబోయేది భాజపా ప్రభుత్వమేనని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీచూడండి:కువైట్‌లో ముగ్గురి హత్య కేసు.. సెంట్రల్ జైలులో కడప జిల్లావాసి వెంకటేశ్ ఆత్మహత్య