తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్ల నిధులిస్తే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. గోషామహల్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్ గారూ.. నా నియోజకవర్గ ప్రజలంతా నన్ను ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేయమంటున్నారు. అలా చేస్తే గోషామహల్‌కు వేల కోట్ల నిధులు వస్తాయి.. అభివృద్ధి చెందుతుందంటున్నారు. మీరు మా నియోజకవర్గానికి నిధులివ్వండి. దళిత బంధు ఇలాగే ఇక్కడ కూడా ఓ పథకం అమలు చేయండి. మరుక్షణమే నేను రాజీనామా చేస్తా. - రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే