లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంపై తనపై కేసు నమోదు చేశారని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యకు నిరసనగా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించిన ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. తనపై కేసు పెట్టినందుకు ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైకాపా ఎమ్మెల్యే ధర్నా.. ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ - ఎమ్మెల్యే ప్రసన్నకుమర్ రెడ్డిపై కేసు వార్తలు
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిచారనే అభియోగంపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన బుచ్చిరెడ్డిపాలెం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

mla prasanakumar reddy protest front of the police station
ధర్నాకు దిగిన వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
Last Updated : Apr 11, 2020, 2:25 PM IST