వైకాపా సర్కార్ వ్యవస్థల గొంతు నొక్కింది: రామానాయుడు - ap state council latest news
శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వ్యవస్థలపై హత్యాయత్నంగా తెదేపా అభివర్ణించింది. ముఖ్యమంత్రి జగన్ చర్యతో అర్ధబలం, అంగబలం లేని బడుగు, బలహీన వర్గాల గొంతు వినిపించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆ పార్టీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేస్తానని ప్లీనరీలో ఇచ్చిన హామీకి జగన్ తూట్లు పొడిచారని ఆక్షేపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరూ సీఎం జగన్‌ను క్షమించరని హెచ్చరించారు. ప్రలోభపెట్టి తెదేపా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను లాక్కున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
వైకాపా సర్కారు వ్యవస్థల గొంతు నొక్కింది:ఎమ్మెల్యే రామానాయుడు
.