వైకాపా ప్రభుత్వం 13 జిల్లాల అభివృద్ధికి కట్టుబడి ఉందని... ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ... అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో అన్ని విషయాలు చర్చించి ముఖ్యమంత్రి జగన్ మంచి నిర్ణయం తీసుకుంటారని... అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని విష్ణు తెలిపారు.
'అన్ని జిల్లాల అభివృద్ధికి వైకాపా కట్టుబడి ఉంది' - ఏపీలో రాజధాని సెగలు వార్తలు
ఈ నెల 27న జరిగే కేబినెట్ భేటీలో అన్ని విషయాలను చర్చించి... అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం సీఎం జగన్ తీసుకుంటారని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు.

mla malladi vishnu comments on capital city