'వారం రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు' - chalo aatmakoor
తెదేపా చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శలు సంధించారు. గత ప్రభుత్వంలో పల్నాడుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో పల్నాడులో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు.
వారం రోజులుగా డ్రామాలు: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. పల్నాడుకు చంద్రబాబు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా నేతల అక్రమ మైనింగ్, ఇసుక దందాను ప్రజలను మర్చిపోలేదన్నారు. ముఖం చెల్లకే పల్నాడు నేతలను చలో ఆత్మకూరుకు చంద్రబాబు పిలవలేదని దుయ్యబట్టారు. మూడేళ్లలో ఎన్నికలంటూ మరో నాటకమాడుతున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.