రాజకీయాల్లో ప్రత్యర్థుల్లా ఉండాలే తప్ప విరోధులుగా ఉండకూడదని సీఎం జగన్‌కి తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. సీఎం తీరు చూస్తుంటే ప్రతికారేచ్ఛతో రగిలిపోతన్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. పాలించే వారికి ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదని అన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలని సూచించారు.
ప్రత్యర్థుల్లా ఉండాలి.. విరోధులుగా కాదు: గోరంట్ల - తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వార్తలు
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలి తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజకీయ కక్ష సాధింపులు సరికావని హితవు పలికారు.
![ప్రత్యర్థుల్లా ఉండాలి.. విరోధులుగా కాదు: గోరంట్ల mla gorantla butchaiah choudary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7611297-6-7611297-1592120640554.jpg)
mla gorantla butchaiah choudary