భౌతికదూరం పాటిస్తూ కరోనా మృతదేహాల అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి గోవింద ధామం దహనవాటికలో కొవిడ్ మృతదేహాల దహనక్రియలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కరోనా మృతదేహాల అంత్యక్రియల్లో భౌతికదూరం పాటిస్తూ పూర్తి చేయవచ్చని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ...కొవిడ్ మృతదేహాల ఖననం విషయంలో ఏ మాత్రం ఆలస్యం కాకుండా తగిన చర్యలు చేపట్టామని అన్నారు.
భౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియల్లో పాల్గొనవచ్చు: ఎమ్మెల్యే భూమన - Bhumana Karunakar Reddy participated in Funerals for covid's body
భౌతికదూరం పాటిస్తూ కొవిడ్ మృతుల అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో కొవిడ్ మృతదేహాల అంత్యక్రియలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నామని చెప్పారు.
Bhumana Karunakar Reddy