MLA anna rambabu dissatisfied: ఏపీ మంత్రివర్గంలో స్థానం లభించకపోవటంతో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అలకపాన్పు ఎక్కారు. ఎవరితో మాట్లాడకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి మార్కాపురంలోని నివాసంలో ఉండిపోయారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలను కలిసేందుకు ఇష్టపడటం లేదని అన్నా రాంబాబు అనుచరులు తెలిపారు.
MLA anna rambabu: మంత్రి పదవి రాలేదని అన్నా రాంబాబు అలక... ఫోన్ స్విచ్చాఫ్ - ఏపీ తాజా వార్తలు
MLA anna rambabu dissatisfied: ఈసారి కూడా కేబినెట్లో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర మనస్థాపానికి లోనైనట్లు తెలుస్తోంది. ఎవరితో మాట్లాడకుండా.. ఆయన నివాసంలోనే ఉండిపోయారు.
ఎమ్మెల్యే అన్నా రాంబాబు
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు నిరసన కొనసాగిస్తున్నారు. అన్నా రాంబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కంభంలో ఆయన అనుచరుల రాస్తారోకో నిర్వహించారు. ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: బజారుకెక్కిన "కేబినెట్ పంచాయితీ".. ఆశావహుల్లో నిరసన జ్వాల!