రాజ్యసభ ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నందున ఓటు వేయలేకపోతున్నట్లు వివరణ ఇచ్చారు. వ్యాపారరీత్యా ఇటీవల తెలంగాణ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిని కలిశానని...ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని చెప్పారు. వైద్యుల సలహా మేరకే ఓటింగ్‌లో పాల్గొనలేకపోతున్నట్లు వివరించారు. ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నాను: ఎమ్మెల్యే అనగాని - mla anagani satya prasad news
రాజ్యసభ ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నందున ఓటు వేయలేకపోతున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వివరణ ఇస్తూ ఆయన లేఖ రాశారు.
mla anagani satya prasad