మిషన్ భగీరథలో భాగంగా తెలంగాణలోని కొమురవెల్లి మల్లన్న సాగర్ నుంచి జనగాం, గజ్వేల్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ సెగ్మెంట్లకు నీటి తరలింపు పనుల అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. పనుల్లో భాగంగా ఇన్టేక్ నిర్మాణం, నీటి శుద్ధి కేంద్రం సహా పైప్లైన్ల పనుల కోసం రూ.674 కోట్ల అంచనా వ్యయంతో 2020 జనవరిలో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. పనుల్లో మార్పులు, చేర్పుల నేపథ్యంలో అంచనా వ్యయాన్ని 674 కోట్ల నుంచి రూ.1,212 కోట్లకు పెంచారు.
Mission Bhagiratha: మిషన్ భగీరథ అంచనా వ్యయం పెంపు - telangana latest news
తెలంగాణలో చేపడుతున్న మిషన్ భగీరథ పనుల్లో భాగంగా ఇన్టేక్ నిర్మాణం, నీటి శుద్ధి కేంద్రం సహా పైప్లైన్ల పనుల కోసం అంచనా వ్యయాన్ని రూ.674 కోట్ల నుంచి రూ.1,212 కోట్లకు పెంచారు. ఈ మేరకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
మిషన్ భగీరథ అంచనా వ్యయం పెంపు
ఈ మేరకు ఈఎన్సీ ప్రతిపాదనలను ఆమోదించి.. సవరించిన అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు జారీచేసింది. దీంతో పాటు ఇప్పటికే పనులు చేస్తున్న మెయిల్ సంస్థకే అదనపు పనులు అప్పగించేందుకూ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీచూడండి: