ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తండ్రీకొడుకులను కలిపిన టిక్​టాక్​ వీడియో! - టిక్​ టాక్​ న్యూస్​

2018లో అదృశ్యమైన తండ్రిని కొడుకుల చెంతకు చేర్చింది టిక్​టాక్. ఎక్కడ వెతికిన దొరకని తండ్రి... చివరకు టిక్​టాక్​ వీడియోలో వారికి కనిపించాడు. అలా తండ్రి కొడుకులను టిక్​టాక్​ కలిపింది.

son found father through tik tok
టిక్​టాక్​తో తల్లిదండ్రులు కలిశారు

By

Published : May 24, 2020, 11:59 AM IST

తండ్రీకొడుకులను కలిపిన టిక్​టాక్​ వీడియో

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రొడ్డం వెంకటేశ్వర్లు పుట్టుకతోనే దివ్యాంగుడు. 2018 ఏప్రిల్​ 27న కూలీ పనుల కోసం వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు అన్ని చోట్ల వెతికారు. కానీ అప్పటి నుంచి వెంకటేశ్వర్లు ఆచూకీ దొరకలేదు. గ్రామానికి చెందిన ఓ యువకుడు టిక్‌టాక్ చూస్తుండగా వెంకటేశ్వర్లు కనిపించిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలిపాడు.

అసలేం జరిగిందంటే?

పంజాబ్‌లోని లుథియానాలో లాక్‌డౌన్‌లో ఆహార పంపిణీ టిక్‌టాక్‌ వీడియోలో వెంకటేశ్వర్లు కనిపించాడు.. పంజాబ్​ లూథియానాలో ఉన్నట్లు కుమారులు తెలుసుకున్నారు. వెంటనే వెంకటేశ్వర్లు కొడుకు కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ద్వారా అనుమతి పత్రం తీసుకుని ప్రత్యేక వాహనంలో రెండు రోజుల క్రితం పంజాబ్ వెళ్లాడు. అక్కడి పోలీసుల సహాయంతో తన తండ్రిని కలుసుకున్నాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోాయారు.

ఇదీ చూడండి:డీజీపీ సవాంగ్​ను కలిసిన యువ ఐఏఎస్​ల బృందం

ABOUT THE AUTHOR

...view details