కొన్ని టీకా కేంద్రాల్లో రెండో డోసు గడువు ముగియక ముందే ప్రజలు వస్తున్నారు. కొవిషీల్డ్ తొలి డోసు వేసుకున్న 42 రోజుల తర్వాతే రెండో డోసుకు అర్హులు. అలాగే కొవాగ్జిన్ తొలిడోసు వేసుకున్న 28 రోజుల తర్వాతే రెండో డోసుకు అర్హులు అవుతారు. మొదటి డోసు ఏ టీకా వేసుకుంటే రెండో డోసు అదే కంపెనీ తప్పనిసరిగా వేయించుకోవాలి. తొలిడోసు వేసుకున్న ప్రజలు అవగాహన లేక గడువుకు ముందే వెళ్తున్నారు.
అవగాహనా లోపం.. గడువు ముగియక ముందే రెండో డోసు కోసం క్యూ.. - ఏపీలో కరోనా కేసుల సంఖ్య
టీకాపై ప్రజల్లో అవగాహన లోపిస్తోంది. మొదటి డోసు వేసుకున్నా తరువాత రెండో డోసుకు ఎన్ని రోజులు గడువు ఉందో తెలియకపోవడంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కొవిషీల్డ్ తొలి డోసు వేసుకున్న 42 రోజుల తర్వాత, కొవాగ్జిన్ తొలిడోసు వేసుకున్న 28 రోజుల తర్వాతే రెండో డోసుకు అర్హులు అవుతారు. మొదటి డోసు ఏ కంపెనీకి చెందిందో.. రెండవది కూడా అదే కంపెనీది వేయించుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
vaccine