మానసిక ఉత్తేజాన్ని భక్తుల్లో ప్రాప్తింపజేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి పంచ నారసింహుల సన్నిధి వివిధ హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఆలయ ప్రాకార మండపంలోని వాయువ్య దిశలో భాగ్యనగరానికి చెందిన దాత ఇంద్రసేనారెడ్డి అద్దాల మండపాన్ని నిర్మిస్తున్నారు.
యాదాద్రిలో సిద్ధమవుతోన్న అద్దాల మండపం - ydadadri bhuvanagiri latest news
తెలంగాణలో యాదాద్రి ఆలయం సుందరంగా నిర్మితమవుతోంది. అందులో భాగంగా అద్దాల మండపాన్ని వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా తీర్చిదిద్దుతున్నారు.
యాదాద్రిలో సిద్ధమవుతోన్న అద్దాల మండపం
దీనిని సంప్రదాయంగా వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా తీర్చిదిద్దుతున్నారు. టేకు కలపతో మండప ద్వారాన్ని మహావిష్ణువు రూపాలతో సిద్ధం చేశారు. మండపంలో ఆలయ దేవుడి రూపాలు, ఊయల దృశ్యాలు సాదృశ్యమయ్యేలా అద్దాల మండపం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే.. రెండు సంవత్సరాల క్రితమే చేసేవారు..