దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై కేంద్ర మంత్రితో చర్చించామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. 2017లో జరిగిన పొరపాట్ల వల్ల పోలవరానికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.
ఆ పొరపాట్ల గురించి కేంద్రమంత్రికి వివరించామన్న ఆయన...2017 నాటి పొరపాట్లపై అవగాహన ఉందని షెకావత్ చెప్పారన్నారు. పోలవరం ముందుకెళ్లేలా చూస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు.
'పోలవరం ప్రాజెక్టులో తాగునీటి భాగాలు తొలగించారు, వాటిని ఉంచాలని కోరాం. విభజన చట్టంలో పోలవరంపై తాగునీటి అవసరాల అంశం కూడా ఉంది. పరిహారం, పునరావాసంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్రమంత్రి షెకావత్‌ను పోలవరం సందర్శించాలని కోరాం. పోలవరానికి 15 రోజుల్లోగా వస్తామని కేంద్రమంత్రి చెప్పారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టు పూర్తి చేస్తాం'