Minor pregnant: బాలికను, మైనర్ బాలుడు గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమంటే నిరాకరించిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో జరిగింది. కోస్గి మండలానికి చెందిన 8వ తరగతి చదివే బాలికను పదో తరగతి చదువుతున్న బాలుడు గర్భవతిని చేశాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం బాలిక తన అవ్వ దగ్గర ఉంటూ చదువుకుంటోంది. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ లో ఉంటున్నారు. బాలిక తన ఇంటి ఎదురుగా ఉండే బాలునితో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం శారీరక సంబంధం వరకూ వెళ్లింది. దీంతో బాలిక గర్భం దాల్చింది.
Minor pregnant: బాలికను గర్భవతిని చేసిన మైనర్ బాలుడు - ap crime news
Minor pregnant: ఆ ఇద్దరు మైనర్లు ఒకే ఊరిలో ఉంటారు. ఇల్లూ కూడా ఎదురెదురుగానే ఉన్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అవ్వ దగ్గర ఉంటూ చదువుకుంటున్న అమ్మాయి.. ఓ మైనర్‌తో ప్రేమలో పడింది. గర్భం దాల్చింది. విషయం పెద్దలకు తెలిసి పంచాయితీ పెట్టారు. ఎటూ తేలకపోవడంతో అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
బాలికను గర్భవతిని చేసిన మైనర్
హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు బాలిక వెళ్లగా వారు గుర్తుపట్టి నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు బాలికను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఊరి పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. బాలుడి తరపునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలిక ఏడు నెలల గర్భవతని సమాచారం.
ఇవీ చదవండి: