ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Murder: తండ్రిని చంపిన కుమార్తె.. ఎందుకంటే..!

Daughter Killed Father : ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని సంబురపడ్డాడు ఆ తండ్రి. అడుగు కింద పెట్టకుండా గుండెలో పెట్టుకుని పెంచాడు. స్తోమతకు మించిందైనా అడిగిన ప్రతీది చేశాడు. తన గారాలపట్టికి ఏ కష్టం రాకూడదని.. ఆహర్నిశలు శ్రమించాడు. ఆమె కోసం రాత్రింబవళ్లు కష్టపడి పని చేసి చదివించాడు. తన బిడ్డపై తండ్రికి ఎంత ప్రేమ ఉందో.. అంతకి రెట్టింపు ఆ కుతురికి నాన్నంటే ప్రేమ ఉండేది. ఇంతలో ఏమైందో.. ఓ చిన్న విషయంలో జరిగిన గొడవ పెద్ద వివాదానికి దారితీసింది. ఎక్కడ మొదలైందో.. ఎప్పుడు పెద్దగైందో తెలియదు కానీ.. ఆ గొడవ తనను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న తండ్రి ప్రాణాన్నే తీసేలా చేసింది.

1
1

By

Published : Apr 29, 2022, 11:10 AM IST

Daughter Killed Father in Mahabubabad : మహబూబాబాద్ జిల్లా వేమునూరులో తండ్రిని ఓ కుమార్తె హత్య చేసింది. ఆస్తిపత్రాలు ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి వెంకన్న(46)ను కూతురు ప్రభావతి(17) కర్రతో కొట్టి చంపింది. గమనించిన స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా అప్పటికే వెంకన్న ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తండ్రీకూతురు ఎంతో ప్రేమగా ఉండేవారని.. ఇంతలో ఏమైందో తెలియదు.. ఇంత ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ కేసులో వివరాల కోసం పోలీసులు.. వెంకన్న ఇంటి పక్కన ఉండేవాళ్లని ఆరా తీశారు.

ఇవీ చదవండి :గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారయత్నం

ABOUT THE AUTHOR

...view details