Gang Rape on minor: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. మాయ మాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Gang Rape on minor: హైదరాబాద్లో మైనర్పై సామూహిక అత్యాచారం - hyderabad crime news
Gang Rape on minor: హైదరాబాద్లో ఓ మైనర్పై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాయమాటలు చెప్పి మిత్రుని గదిలోకి తీసుకెళ్లిన యువకులు.. అనంతరం ఆఘాయిత్యానికి పాల్పడ్డారు.
![Gang Rape on minor: హైదరాబాద్లో మైనర్పై సామూహిక అత్యాచారం Gang Rape on minor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14533877-28-14533877-1645508087978.jpg)
బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన బాలిక(17)ది చెత్త ఏరుకుని జీవించే పేద కుటుంబం. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో అదే బస్తీకి చెందిన శివ(22) బాలికకు ఏవో మాటలు చెప్పి సమీపంలోని మరో బస్తీలో ఉండే మిత్రుడు సాయి(20) గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఉదయం 4 గంటలకు వారి గది నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. దీంతో తల్లి వెంటనే ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి వారిపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీచూడండి: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు