ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కర్నూలు జిల్లాలో టెస్టింగ్ ల్యాబ్​ ఏర్పాటుకు ప్రయత్నాలు' - corona news in ap

రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన కర్నూలు జిల్లాపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కొవిడ్-19 నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించిన ఆయన...ప్రభుత్వపరంగా అందించాల్సిన సాయంపై చర్చించారు.

ministers review on covid 19 in kurnool district
ministers review on covid 19 in kurnool district

By

Published : Apr 6, 2020, 3:49 PM IST

మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రులు

కరోనా కేసులు ఒక్కసారిగా ఎగబాకిన కర్నూలు జిల్లాలో తక్షణమే టెస్టింగ్‌ ల్యాబ్ ఏర్పాటు ప్రయత్నాలు చేపట్టినట్లు మంత్రులు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో పరిస్థితిని ఎదుర్కోవడంపై అధికారులతో సమీక్షించిన మంత్రులు ఆళ్ల, బుగ్గన... కేవలం దిల్లీ ఘటన కారణంగానే జిల్లాలో ఒక్కసారిగా కేసులు పెరిగాయని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ నమోదైన 56 పాజిటివ్ కేసుల్లో 55 మంది దిల్లీకి వెళ్లి వచ్చిన వారే ఉన్నారన్నారు. కర్నూలులో ల్యాబ్‌ ఏర్పాటయ్యే వరకూ హైదరాబాద్‌లో పరీక్షలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details