బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్ లను బీసీ సంక్షేమ శాఖా మంత్రి వేణుగోపాల్ ప్రకటించారు. బీసీల్లో మొత్తం 139 వెనుకబడిన కులాలున్నాయని.. వీటికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్ లను ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఒక్కొక్క కార్పొరేషన్ కు ఛైర్మన్, డైరక్టర్ ఉంటారన్నారు. మొత్తం 728 మంది నేతలకు అవకాశం వచ్చిందని చెప్పారు.
వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రానికి బీసీలు వెన్నుముకలాంటి వారని అన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో బీసీల బాధలను తెలుసుకుని వారికి రాజకీయ ప్రాధాన్యతనిచ్చారన్నారు. నాడు పాదయాత్ర సందర్భంగా బీసీ వర్గాలకు జగన్ మాట ఇచ్చారని... ఆ మేరకు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఎంపీ మోపిదేవి తెలిపారు.