గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వివిధ పార్టీల నేతలు వెల్లువలా తరలివస్తున్నారు. నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు... పోలింగ్ కేంద్రాల వద్ద వరుసలో నిలుచుని ఓటేస్తున్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగర ప్రజలు తమ ఓటుహక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.
కూకట్‌పల్లిలోని శేషాద్రినగర్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ ఓటు వేశారు. శేరిలింగంపల్లిలోని వివేకానంద నగర్ క్లబ్‌హౌస్‌లో స్థానిక శాసనసభ్యులు అరికెపుడి గాంధీ... ఉప్పల్‌లో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి.. సతీమణి స్వప్నతో కలిసి ఓటు వేశారు.