పండ్లమార్కెట్ను తాత్కాలికంగా నిర్వహించేందుకు కొత్తపేట వీఎంహోం, బాటసింగారం లాజిస్టిక్ పార్కులను రేపు పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పండ్ల మార్కెట్ నిర్వహణపై మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ సమావేశం నిర్వహించారు. మజ్లిస్ ఎమ్మెల్యేలు బలాలా, జాఫర్ హుస్సేన్, మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో ఆసుపత్రి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బాటసింగారం లాజిస్టిక్ పార్కులో తాత్కాలికంగా పండ్ల మార్కెట్ నిర్వహించాలని మార్కెటింగ్ శాఖ ప్రతిపాదించింది.
Gaddi Annaram Fruit Market: బాటసింగారం లాజిస్టిక్ పార్కులో పండ్ల మార్కెట్! - telangana varthalu
పండ్లమార్కెట్ను తాత్కాలికంగా నిర్వహించేందుకు కొత్తపేట వీఎంహోం, బాటసింగారం లాజిస్టిక్ పార్కులను రేపు పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ రెండు ప్రాంతాలను రేపు పరిశీలించనున్నారు. బాటసింగారం లాజిస్టిక్ పార్కులో తాత్కాలికంగా పండ్ల మార్కెట్ నిర్వహించాలని మార్కెటింగ్ శాఖ ప్రతిపాదించింది.
బాటసింగారంలో అన్ని వసతులు కల్పించామన్న మార్కెటింగ్ శాఖ అధికారులు.. కోహెడలో మౌలికసదుపాయాలు కల్పించే వరకు బాటసింగారంలో కొనసాగిస్తామని ప్రతిపాదించారు. అయితే తాత్కాలికంగా మార్కెట్ నిర్వహణకు బాటసింగారంకు బదులుగా కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ - వీఎంహోం ప్లేగ్రౌండ్లో కొనసాగించాలని మజ్లిస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో తాత్కాలిక పండ్ల మార్కెట్ కోసం విక్టోరియా ప్లే గ్రౌండ్తో పాటు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్ రెండు స్థలాలను పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బలాలా, జాఫర్ హుస్సేన్, అధికారులు రెండు ప్రాంతాలను రేపు పరిశీలించనున్నారు. స్థలాల పరిశీలన అనంతరం తాత్కాలిక మార్కెట్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.