ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యక్తిగత పట్టుదలకు, ఒక పార్టీ చేసిన కుట్రకు నిదర్శనమే ఈ పరిస్థితి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె. కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని అత్యున్నత న్యాయస్థానంపై గౌరవం ఉందని స్పష్టం చేశారు.
ప్రతిష్ట కోసం ప్రజారోగ్యంతో నిమ్మగడ్డ చెలగాటం: మంత్రులు - ఏపీ పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు తెలిపారు. నిమ్మగడ్డ వ్యక్తిగత పట్టుదలకు, ఒక పార్టీ చేసిన కుట్రకు నిదర్శనమే ప్రస్తుత పరిస్థితి అని వ్యాఖ్యానించారు.
supreme court verdict on ap local polls 2021