నిన్న శాసనసభలో ఆమోదం పొందిన అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఇవాళ శాసనమండలికి వచ్చింది. ఇక్కడే వైకాపాకు అసలు చిక్కు వచ్చిపడింది. తెదేపా ఉపయోగించిన రూల్ 71.. బ్రహ్మాస్త్రానికి మంత్రులు, ఎమ్మెల్యేలు మండలికి వచ్చి చేరారు. శాసనమండలిలో అధికార పార్టీ సభ్యుల అరుపులతో సభలో గందరగోళం ఏర్పడింది. రూల్ 71పై పున:సమీక్షించాలని మంత్రులు పట్టుబట్టారు. పదేపదే ఇదే విధంగా కొనసాగి... సభ అనేకసార్లు వాయిదా పడింది. మంత్రులు చెప్పిన విషయాన్ని ఛైర్మన్ తిరస్కరిస్తూ వచ్చారు. చేసేదేమీ లేక.. మంత్రులు పోడియం వద్దకు వెళ్లి.. పున: సమీక్షించాలని కోరారు. అయితే ఈ వ్యవహారాన్నంత.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్యాలరీలోకి వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్యేలు రావడం వల్ల మండలి గ్యాలరీ కిక్కిరిసిపోయింది.
మంత్రులు పోడియం వద్దకు.. ఎమ్మెల్యేలు గ్యాలరీలోకి!
ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గందరగోళం చేయడం చూస్తుంటాం. కానీ ఇవాళ శాసనమండలిలో మంత్రులు వచ్చి.. గందరగోళం చేసిన పరిస్థితి. తెదేపా ఉపయోగించిన బ్రహ్మాస్త్రమే ఇందుకు కారణం.
ministeras ap legislative council
ఇదీ చదవండి: తెదేపా బ్రహ్మాస్త్రం: ఇంతకీ రూల్ 71 ఏంటీ?
Last Updated : Jan 21, 2020, 8:27 PM IST
TAGGED:
mandali