మార్పుపై మాట్లాడే అర్హత ప్రతిపక్షనేత జగన్‌కు లేదని మంత్రి యనమల విమర్శించారు. ఏపీ నమ్మక ద్రోహం చేసిన భాజపా, తెరాసతో కుమ్మక్కై కుట్రలు పన్నడమే మార్పా అని ఓ పత్రికా ప్రకటనలో ప్రశ్నించారు.అసెంబ్లీ రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడమే మార్పా? లేక రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే మార్పా అని వ్యంగాస్త్రాలు సంధించారు. 9 లక్షల ఫారం-7 దరఖాస్తుల వెనుక కుట్రదారులెవరో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రం పెట్రో కాంప్లెక్స్ ఇవ్వకపోవడంపై కాకినాడ సభలో జగన్ నోరెందుకు మెదపట్లేదని విమర్శించారు. సొంత జిల్లా స్టీల్ ప్లాంట్ పై మాట్లాడని జగన్‌ను ప్రజలెలా నమ్ముతారన్నారు. జగన్ జైలుకెళ్లాడని అందరినీ జైలుకు పంపడం శాడిజమని వ్యాఖ్యానించారు.
'ద్రోహులతో కుమ్మక్కవడమే మార్పా?' - minister_yanamala_fire_on_ys_jagan
''మార్పుపై జగన్‌కు మాట్లాడే అర్హత లేదు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడమే మార్పా? లేక రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ కోరుకునే మార్పా? 9 లక్షల ఫారం-7 దరఖాస్తుల వెనుక కుట్రదారులెవరు? ఓటమి భయంతోనే భాజపా, తెరాసతో జగన్ కలిశారు.'' - మంత్రి యనమల
మంత్రి యనమల రామకృష్ణుడు