రెండవ దశలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు పాటించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ ప్రజలకు సూచించారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మిత్రులు తనను ప్రత్యక్షంగా కలుసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. చరవాణి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించాలని చెప్పారు.
నన్ను ప్రత్యక్షంగా కలవొద్దు: మంత్రి పినిపే విశ్వరూప్ - Minister of Social Welfare latest news
సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని కోరారు.
మంత్రి పినిపే విశ్వరూప్