ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vidala Rajini review: "డిసెంబరు నాటికి ఆ నిర్మాణాలు పూర్తికావాలి' - అధికారులతో మంత్రి రజిని సమీక్ష

Vidala Rajini review: విలేజ్​ హెల్త్​ క్లినిక్​ల నిర్మాణాలు డిసెంబరులోగా పూర్తికావాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. వీటివల్ల గ్రామీణులకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. పనుల పురోగతిపై ప్రతినెలా సమీక్ష జరుపుతామన్నారు.

Vidala Rajini review
మంత్రి రజిని సమీక్ష

By

Published : Aug 9, 2022, 9:11 AM IST

Vidala Rajini review: రాష్ట్రంలో రూ.2,532 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్కులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు, ఆధునికీకరణ పనులను ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో ప్రారంభంకానున్న ‘ఫ్యామిలీ డాక్టర్‌’ పథకం అమలుకు తగ్గట్లు నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధపెట్టాలని అధికారులకు సూచించారు. ఈ నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. పనుల పురోగతిపై ప్రతినెలా సమీక్ష జరుపుతామన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ కోసం రూ.1,500 కోట్లు ఖర్చుపెడుతున్నామని అన్నారు. వీటివల్ల గ్రామీణులకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖతో పాటు పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details