Minister Venugopala Krishna: పాత్రికేయుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సమాచార, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పాత్రికేయులు కూడా సీఎంను మనస్ఫూర్తిగా ఆరాధిస్తే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి చెప్పారు. జగన్‌ను ఆరాధించకుండా ఆయన గురించి ఆరా తీస్తున్నారని... అది మానుకొని ఆరాధించాలని చెప్పారు. సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని హామీ ఇచ్చారు. డీబీటీ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని అన్నారు. 139 బీసీ ఉపకులాలకు ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏపీలో అవకాశాలున్నాయని వాటిని విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎంను ఆరాధిస్తే... తప్పక ఇళ్ల స్థలాలు: మంత్రి చెల్లుబోయిన - ఏపీ రాజకీయ వార్తలు
Minister Venugopala Krishna: పాత్రికేయుల సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. పాత్రికేయులు కూడా సీఎంను మనస్ఫూర్తిగా ఆరాధించాలని వ్యాఖ్యానించారు. సీఎంను ఆరా తీయకుండా.. ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని అన్నారు.

మంత్రి చెల్లుబోయిన
మంత్రి వేణుగోపాలకృష్ణ
Last Updated : Apr 12, 2022, 5:06 PM IST