Minister Venu Gopal : రాష్ట్రంలో అశాంతిని సృష్టించేలా ప్రతిపక్షమైన తెదేపా వ్యవహరిస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. ఇక్కడి రైతులతో ఒకసారి తిరుపతికి.. ఇపుడు అరసవల్లికి పాదయాత్ర చేసేలా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అమరావతిని రాజధాని చేసి తన వారి చేతే భూములు కొనిపించారని ఆరోపించారు. పాలనా సౌలభ్యం కోసమే 26 జిల్లాలు చేశామని.. పరిపాలన సౌలభ్యం కోసమే ఇప్పుడు 3 రాజధానుల పెట్టాలని భావిస్తున్నట్లు వివరించారు.
బౌన్సర్లు, బెంజ్ కార్లతో పాదయాత్రా..?: మంత్రి చెల్లుబోయిన - minister venugopal fires on chandrababu
Minister Venugopal On Farmers Padayatra : అమరావతి రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేయలేదని.. కేవలం వ్యాపారం, లాభం కోసం మాత్రమే ఇచ్చారని మంత్రి చెల్లుబోయిన వ్యాఖ్యానించారు. బౌన్సర్లు, బెంజ్ కార్లతో రైతులు పాదయాత్ర చేస్తారా అని ప్రశ్నించారు.
Minister Venugopal On Farmers Padayatra
కొడాలి నానిపై తెదేపా సోషల్మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కొడాలి నాని భాషలో విపరీత అర్థాలు తీస్తున్నారన్నారు. ఇక్కడి రైతులు అమరావతి కోసం భూములు త్యాగం చేయలేదని.. వ్యాపారం, లాభం కోసం మాత్రమే ఇచ్చారన్నారు. బౌన్సర్లు, బెంజ్ కార్లతో రైతులు పాదయాత్ర చేస్తారా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: