'బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడిని వీఐపీగా పరిగణించాలి' - minister vellampally srinivasa rao
కాణిపాకం వరసిద్ధి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు.
'బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడిని వీఐపీగా పరిగణించాలి'
కాణిపాకం వరసిద్ధి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడిని వీఐపీగా పరిగణించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన మంత్రి.. దేవాలయాల పవిత్రతను కాపాడుకుంటూ.. ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలందిద్దాం అని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. యాత్రికులకు వసతి, తాగునీరు సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.