ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామతీర్థం ఘటన వెనుక తెదేపా హస్తం: మంత్రి వెల్లంపల్లి

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉండి విజయవాడలో ఎన్నో ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు...ఇవాళ బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రామతీర్థం ఘటనలో తెదేపా హస్తముందని ఆరోపించారు. ఈ విషయంపై చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయడంలేదని ప్రశ్నించారు.

minister vellampalli srinivas
minister vellampalli srinivas

By

Published : Jan 2, 2021, 9:08 PM IST

రామతీర్థంలోని రాముడి విగ్రహం ధ్వంసం కేసులో తెదేపా హస్తముందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు రామతీర్థం వెళ్లి బురద రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి విజయవాడలో ఎన్నో ఆలయాలు కూల్చివేసిన చంద్రబాబు... ఇవాళ రాజకీయాలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.

విజయవాడలో గోశాల కూల్చివేత ఘటనలో చంద్రబాబే ఉన్నారనే విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని మంత్రి విమర్శించారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపం కూల్చింది చంద్రబాబు అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడు విగ్రహం ధ్వంసం వెనక తమ పార్టీ లేదని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయలేదని మంత్రి ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details