రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడే అందరికీ అండగా ఉంటామని, ఎవరి విమర్శలను పట్టించుకోబోమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర నుంచి తాము ఆశీస్సులు తీసుకుంటే దానిపై తెదేపా నేతలు ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. గతంలో ఆ పార్టీ నేతలు కూడా స్వామి నుంచి ఆశీస్సులు పొందారని వ్యాఖ్యానించారు. కార్తీక మాసం మొదటి సోమవారం రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో విజయవాడ వాసి నరసింహారావు ఐదు కోట్ల 40 లక్షల రూపాయల విరాళంతో చేసిన శివాలయం అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటే ఆరోపణలా..? - స్వామి స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకల వార్తలు
స్వామి స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెదేపా నేతలు తప్పుబట్టడం సరికాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఆ పార్టీ నేతలు కూడా స్వామి నుంచి ఆశీస్సులు పొందారన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడే అందరికీ అండగా ఉంటామని వ్యాఖ్యానించారు.
![స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటే ఆరోపణలా..? Minister_Vellampalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9558559-346-9558559-1605519430152.jpg)
Minister_Vellampalli