లాక్‌డౌన్ వల్ల సినీ పరిశ్రమకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సినీరంగంపై ఆధారపడి లక్షల మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా కరోనాను తరిమికొట్టి యథావిధిగా కార్యకలాపాలు సాగించేందుకు చర్యలు తీసకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు తలసాని వివరించారు.
లాక్‌డౌన్ తర్వాత సినీపరిశ్రమ పెద్దలతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.