విజయవాడ నిడమానూరు బడిలోని వసతులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్ పరిశీలించారు. రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో...అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈనెల 23 నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తామని అన్నారు. కొన్ని పాఠశాలల్లో ఇంకా నాడు- నేడు పనులు పూర్తి కాలేదన్నారు. పెండింగ్లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి విద్యార్థికీ 3 మాస్కులు అందించామని వివరించారు. ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపాలని మంత్రి పిలుపునిచ్చారు. అన్ని పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ పూర్తైందన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.
భయం లేకుండా పిల్లలను బడికి పంపండి: మంత్రి సురేశ్ - ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం
ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపాలని మంత్రి సురేశ్ పిలుపునిచ్చారు. రేపట్నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని.. కరోనా నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టామన్నారు. ప్రతి విద్యార్థి కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని కోరారు.
minister suresh
TAGGED:
minister suresh latest news